ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీతక్క - మీనాక్షి భేటీ
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీతక్క - మీనాక్షి భేటీ...
--- నిరుద్యోగులను ముంచింది బీఆర్‌ఎస్: సీతక్క
హైదరాబాద్, జులై 17, (ప్రజానాడి): ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శనివారం ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలు, స్థానిక సమస్యలపై దాదాపు గంటపాటు ఇరువురూ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులను నిలువునా ముంచిన చరిత్ర బీఆర్‌ఎస్‌దేనని ఆరోపించారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, ఇప్పుడు ఉద్యోగం పోగానే నిరుద్యోగులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులు తస్మాత్ జాగ్రత్త, బీఆర్‌ఎస్‌ను నమ్ముకుంటే నష్టపోతారని సీతక్క హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 50 వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో విడుదల కానున్నాయని తెలిపారు. అయితే కోర్టు కేసుల కారణంగా కొన్ని నోటిఫికేషన్లు ఆలస్యం అయ్యాయని వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో 15 వేలకు పైగా అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు. సర్ కార్యక్రమంపై పూర్తి నివేదికను ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఇచ్చినట్లు సీతక్క తెలిపారు. క్షేత్ర స్థాయిలో సర్ పై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని ఇన్‌చార్జి సూచించారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని సీతక్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉందని, వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.