🏠 www.prajanadinews.in
Watermark
Newspaper Logo
www.prajanadinews.in | Date: 25 Jul, 2026 | Page: 1

గ్రామాన్ని పరిశుభ్రంగా..ఆరోగ్యంగా ఉంచడమే మాలక్ష్యం:వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ సుగుణ స్వామి




వెంకటాపూర్ (ప్రజానాడి న్యూస్ ):గ్రామం లోని రోడ్లకు ఇరువైపుల పెరిగిన గడ్డి మరియు పిచ్చి మొక్కలను నివారించేందుకు గ్రామ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ స్వామి నూతన గడ్డి మందు పిచికారి మిషన్ ను ప్రారంభించారు.శనివారం గ్రామ ప్రధాన రహదారులు మరియు కాలనీల్లోని రోడ్లకు ఇరువైపుల పెరిగిన గడ్డిని తొలగించేందుకు సర్పంచ్ స్వయంగా మిషన్ ను ఓపెన్ చేసి గడ్డి మందు పిచికారి చేశారు. పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుగుణ స్వామి మాట్లాడుతూ వర్షాల కారణంగా రోడ్లకు ఇరువైపుల గడ్డి, పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల దోమలు, పాములు, క్రిమి కీటకాల బెడద పెరిగే అవకాశం ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. వీటన్నింటిని నివారించేందుకు నూతన గడ్డి మందు మిషన్ ను తీసుకొచ్చాం. నేను ఇచ్చిన మాట ప్రకారం ఊరు ప్రజలకు మేలు చేసే విధంగా నిరంతరం చర్యలు చేబడతాను. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడమే మా లక్ష్యం" అని తెలిపారు.గడ్డి మందు పిచికారి కారణంగా రోడ్లు విశాలంగా కనిపించడంతో పాటు, ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ అన్నబోయిన రాజు ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు కోటి సీనియర్ నాయకులు అల్లాడి రాజేశ్వరావు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మిల్కూరి యుగేందర్ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గొల్లేనా వెంకటేష్ గాజుల శ్రీను రెడ్డి శ్రీధర్ ప్రవీణ్ గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home