జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి..
-- కలెక్టర్ కలసిన వెంకటాపూర్ జర్నలిస్టులు
-- సానుకూలంగా స్పందించిన కలెక్టర్
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని వెంకటాపూర్ జర్నలిస్టులు ములుగు కలెక్టర్ హేమంత్ బొర్కడే వాసుదేవరావును కోరారు. ఈ మేరకు వెంకటాపూర్ జర్నలిస్టులు సోమవారం ములుగు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కలెక్టర్ ను ప్రత్యేకంగా కలిశారు. గత కొన్నేళ్లుగా తాము మీడియా వృత్తిలో కొనసాగుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. అలాంటి తాము 4 సంవత్సరాలుగా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామ శివారులోని రెవిన్యూ భూమిలో గుడిసెలు వేసుకొని మోకా మీద ఉన్నామని ఆయనకి తెలిపారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశంపై పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ మహేందర్ జీ కి సిఫారస్ చేసినట్లు జర్నలిస్టులు తెలిపారు. ఇంటి స్థలాల అంశంపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ కి సైతం వెంకటాపూర్ జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో వెంకటాపూర్ జర్నలిస్టలు బేతి సతీష్ యాదవ్, ఒద్దుల మురళీ, పిల్లలమర్రి శివ, గునిగంటి హరీష్, మామిడిశెట్టి ధర్మ తేజ, తదితరులు ఉన్నారు.