🏠 www.prajanadinews.in
Watermark
Newspaper Logo
www.prajanadinews.in | Date: 12 Oct, 2026 | Page: 1

మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికిన అధ్యక్షులు పైడాకుల అశోక్

---- దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మంత్రి...

హైదరాబాద్ (ప్రజానాడి న్యూస్):దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని రాష్ట్ర మంత్రి సీతక్క హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది.
డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ పిలుపు మేరకు ములుగు జిల్లా నుండి కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో శంషాబాద్ విమానాశ్రయానికి తరలివచ్చారు. మంత్రి సీతక్కకు పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. జిల్లా అధ్యక్షుడు అశోక్ స్వయంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. మంత్రి సీతక్క విదేశీ పర్యటన విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అశోక్ తో పాటు గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్క కమిటీ చెర్మన్ రేగా కళ్యాణి , మున్సిపల్ చైర్మన్ చంద్రకళ , వెంకటాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండి శ్రీను, కుమార్ గౌడ్ , జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home