రాష్ట్రంలోని రైస్ మిల్లర్లందరికీ ఓటు హక్కు కల్పించాలి...
ములుగు ప్రజానాడి న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంఆర్ పెట్టె రైస్ మిల్లర్లు అందరికీ త్వరలో జరిగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా మిల్లర్లు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో ములుగు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆరు జిల్లాలకు చెందిన అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 2013 నుంచి అసోసియేషన్ కు ఎన్నికలు జరగకపోవడంతో అప్పటినుంచి ఒకే కార్యవర్గం అధికారంలో ఉందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఉన్న మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో ఆ కమిటీ పూర్తిగా...