గ్రామాన్ని పరిశుభ్రంగా..ఆరోగ్యంగా ఉంచడమే మాలక్ష్యం:వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ సుగుణ స్వామి

వెంకటాపూర్ (ప్రజానాడి న్యూస్ ):గ్రామం లోని రోడ్లకు ఇరువైపుల పెరిగిన గడ్డి మరియు పిచ్చి మొక్కలను నివారించేందుకు గ్రామ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ స్వామి నూతన గడ్డి మందు పిచికారి మిషన్ ను ప్రారంభించారు.శనివారం గ్రామ ప్రధాన రహదారులు మరియు కాలనీల్లోని రోడ్లకు ఇరువైపుల పెరిగిన గడ్డిని తొలగించేందుకు సర్పంచ్ స్వయంగా మిషన్ ను ఓపెన్ చేసి గడ్డి మందు పిచికారి చేశారు. పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుగుణ స్వామి మాట్లాడుతూ వర్షాల కారణంగా రోడ్లకు ఇరువైపుల గడ్డి, పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల దోమలు, పాములు, క్రిమి కీటకాల బెడద పెరిగే అవకాశం ఉంది....