ఎల్లారెడ్డిపల్లిలో ఘనంగా వన మహోత్సవం....
వెంకటాపూర్( ప్రజానాడి) :రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బాషబోయిన పోషాలు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొక్కలు నాటారు. అనంతరం సర్పంచ్ పోషాలు యాదవ్ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని, కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు...