భవిష్యత్తు పై బెంగతో యువకుడి ఆత్మహత్య...
వెంకటాపూర్( ప్రజానాడి న్యూస్) : భవిష్యత్తుపై బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో జరిగింది.పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలంపేటకు చెందిన పిట్టల సాగర్ (24) తల్లిదండ్రులు కొంతకాలం క్రితం చనిపోయారు. ఇల్లు, ఆస్తిపాస్తులు లేకపోవడం, పెళ్లి, భవిష్యత్తుపై ఆందోళనతో కొద్దిరోజులుగా మనస్తాపంలో ఉన్నాడు.సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 1 గంట సమయంలో అన్న రత్నాకర్ కు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగి కట్ చేశాడు. కొద్దిసేపటికే స్థానికులు రత్నాకర్ కు ఫోన్ చేసి సాగర్ ఎల్లమ్మ గుడి సమీపంలోని కాలువ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని చెప్పారు.వెంటనే...