ములుగులో రైస్ మిల్లుల బంద్.. సమ్మెలోకి మిల్లర్లు...
--- ప్రభుత్వ తీరుకు నిరసనగా నేటి నుండి మిల్లింగ్ నిలిపివేత.. ములుగు, ప్రజానాడి న్యూస్ :తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ ములుగు జిల్లా రైస్ మిల్లర్లు సమ్మె బాట పట్టారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సోమవారం 8వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. సంఘం అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో మిల్లర్లు కలెక్టర్ ను కలిశారు.తమకు ఎదురవుతున్న ఇబ్బందులను లేఖలో వివరించారు. పౌర సరఫరాల సంస్థ 2025-26 ధాన్యంపై తనిఖీలు చేపడుతోందని, వివిధ కారణాల వల్ల మిల్లులలో 15 నుండి 20 శాతం వరకు...