Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచానికి చాటేలా హెరిటేజ్ రన్

    Author PRAJA NADI NEWS | 17 Jul 2026, 08:32 PM | Sports, TELANGANA
    తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచానికి చాటేలా హెరిటేజ్ రన్

    తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచానికి చాటేలా హెరిటేజ్ రన్'
    *గుంజేడు ముసలమ్మ ఆలయం నుంచి ఏకశిలా పార్కు వరకు .*నిఖిల్ కుమార్ సాహస యాత్ర

    ములుగు, జూలై 17: తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచే లక్ష్యంతో ములుగు జిల్లాకు చెందిన గిరిజన యువకుడు, ఎన్‌ఐటీ కాలికట్ విద్యార్థి, ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ లో పాల్గొంటున్న సందర్భంగా నిఖిల్ కుమార్ ఆధ్వర్యంలో 'తెలంగాణ హెరిటేజ్ రన్' నిర్వహించనున్నారు.
    జూలై 19 (ఆదివారం) అర్ధరాత్రి 12 గంటలకు గుంజేడు ముసలమ్మ ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ 70 కిలోమీటర్ల హెరిటేజ్ రన్, ఉదయం 8 గంటలకు హనుమకొండలోని ఏకశిలా పార్కు వద్ద ముగియనుంది.
    ఈ పరుగు తెలంగాణలోని ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల మీదుగా సాగనుంది. గుంజేడు ముసలమ్మ ఆలయం, పాకాల సరస్సు, కొమ్మల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, వెయ్యి స్తంభాల ఆలయాన్ని సందర్శిస్తూ ఏకశిలా పార్కు వరకు కొనసాగుతుంది.
    గత కొన్నేళ్లుగా అనేక మారథాన్‌లు, అల్ట్రా మారథాన్‌లు, ఒలింపిక్ దూరం ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన నిఖిల్ కుమార్, ఈ హెరిటేజ్ రన్ ద్వారా తెలంగాణ పర్యాటక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటడంతో పాటు యువతలో ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం కల్పించాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నారు.
    ఈ కార్యక్రమాన్ని తెలంగాణ పర్యాటక శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు పర్యాటక శాఖతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వినూత్న హెరిటేజ్ రన్‌కు ప్రజలు, క్రీడాభిమానులు, పర్యాటక ప్రేమికులు సహకరించాలని వారు కోరారు.