Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజాభవన్‌లో వన మహోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క - పాల్గొన్న ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్..

    Author PRAJA NADI NEWS | 25 Aug 2026, 01:27 PM | Array
    ప్రజాభవన్‌లో వన మహోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క - పాల్గొన్న ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్..

    హైదరాబాద్ (ప్రజానాడి ):ప్రజాభవన్‌లో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ
    శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మంత్రి వెంట పాల్గొన్నారు.
    ఈ సందర్భంగా మంత్రి సీతక్క మొక్క నాటి ప్రజలకు వన మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
    అడవులను దట్టంగా పెంచడం ద్వారా వన్యప్రాణులకు ఆహారం, ఆవాసం లభిస్తుందని, తద్వారా అవి జనావాసాల్లోకి రాకుండా నివారించవచ్చని సూచించారు. ముఖ్యంగా కోతులు గ్రామాల్లోకి రాకుండా అడవుల్లోనే వాటికి ఆహారంగా ఉపయోగపడే పండ్ల మొక్కలను విరివిగా పెంచాలని కోరారు.

    ప్రజాభవన్‌లో వన మహోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క - పాల్గొన్న ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్.. - Additional Image