Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫార్మర్ రిజిస్ట్రేషన్ కు గడువు పొడగింపు...

    Author PRAJA NADI NEWS | 23 Sep 2026, 07:21 AM | Technology, TELANGANA, ములుగు
    ఫార్మర్ రిజిస్ట్రేషన్ కు గడువు పొడగింపు...

    --- వ్యవసాయ విస్తరణ అధికారి మహిపవన్ వెల్లడి

    వెంకటాపూర్, ప్రజానాడి :నల్లగుంట క్లస్టర్ పరిధిలోని రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను సెప్టెంబర్ 30 వరకు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి ఆర్. మహిపవన్ తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని పక్షంలో ఎరువుల బుకింగ్, సాయిల్ హెల్త్ కార్డులు, పి.ఎం. కిసాన్, రైతు భరోసా, పంట అమ్మకాలు తదితర వ్యవసాయ శాఖ పథకాల లబ్ధి పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
    రైతులు తమ ఆధార్ కార్డుకు అనుసంధానమైన మొబైల్ నంబర్, పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డుతో స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని గానీ, సమీపంలోని మీసేవ, సీఎస్సీ కేంద్రాలను గానీ సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.