Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ములుగులో రైస్ మిల్లుల బంద్.. సమ్మెలోకి మిల్లర్లు...

    Author PRAJA NADI NEWS | 08 Sep 2026, 07:19 PM | Array
     ములుగులో రైస్ మిల్లుల బంద్.. సమ్మెలోకి మిల్లర్లు...

    --- ప్రభుత్వ తీరుకు నిరసనగా నేటి నుండి మిల్లింగ్ నిలిపివేత..
    ములుగు, ప్రజానాడి న్యూస్ :తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ ములుగు జిల్లా రైస్ మిల్లర్లు సమ్మె బాట పట్టారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సోమవారం 8వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. సంఘం అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో మిల్లర్లు కలెక్టర్ ను కలిశారు.తమకు ఎదురవుతున్న ఇబ్బందులను లేఖలో వివరించారు. పౌర సరఫరాల సంస్థ 2025-26 ధాన్యంపై తనిఖీలు చేపడుతోందని, వివిధ కారణాల వల్ల మిల్లులలో 15 నుండి 20 శాతం వరకు తరుగు వచ్చిందని, దీనికి జరిమానా వేయకుండా బియ్యం ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని కోరారు.రబీ సీజన్ లో వచ్చిన బాయిల్డ్ రకం ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులలోనే నిల్వ చేశామని, ప్రభుత్వానికి అవసరం లేకపోతే టెండర్ల ద్వారా తరలించాలని సూచించారు. అలాగే రైతుల నుండి వచ్చే నాణ్యత తక్కువ ధాన్యం వల్ల బియ్యం తయారీలో 10 శాతం వరకు రంగు మారిన బియ్యం వస్తోందని, దానిని తక్కువ ధరకు అమ్మడం వల్ల క్వింటాలుకు రూ.1000 వరకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఖరీఫ్ ధాన్యం తెచ్చి 9 నెలలు గడిచినా ప్రభుత్వం బియ్యం తీసుకోకపోవడం వల్ల బస్తాకు 4 కిలోల చొప్పున తరుగు వచ్చిందని, దీనికి ప్రభుత్వ జాప్యమే కారణమని పేర్కొన్నారు. అధికారుల ఒత్తిడితో బహిరంగ ప్రదేశాల్లో సైతం ధాన్యం నిల్వ చేశామని, గోదాముల కొరత, బాయిల్డ్ బియ్యాన్ని ఎఫ్.సి.ఐ తీసుకోకపోవడం వల్ల ధాన్యం పాడయ్యే పరిస్థితి ఉందని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని మిల్లర్లు విజ్ఞప్తి చేశారు.